తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కార్యాచరణలో భాగంగా రాష్ట్రం నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.
డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో తొలిసారిగా ఈ క్రీడలు జరగనున్నాయి.
ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి గారు మంత్రి వాకిటి శ్రీహరి గారితో పాటు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ క్రీడల ఏర్పాట్ల పురోగతిని సమీక్షించేందుకు ఈ సమావేశం జరిగింది.
ప్రారంభ వేడుకలను ఎల్బీ స్టేడియంలో, ముగింపు వేడుకలను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని, విజిలెన్స్ నిఘా ఉండాలని సీఎం ఆదేశించారు. ఏర్పాట్లలో విజిలెన్స్ నిఘా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
స్టేడియంల పునరుద్ధరణ, ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.





