POULTRY INDIA EXPO- 2026 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో 2026 ఏర్పాటు చేయడం అభినందనీయం.
పౌల్ట్రీ వ్యాపారులు 5 కోట్ల 30 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి విద్యార్థులు, యువతకు పౌష్టికాహారం అందించడంలో భాగస్వాములవుతున్నారు.
సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని పౌల్ట్రీ వ్యాపారులు ప్రతిపాదనలు ఇచ్చారు.
గ్రామ పంచాయతీల్లో పౌల్ట్రీ ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తోంది.
ఎల్ నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు సర్కార్ దగ్గర ఉన్నాయి.
పౌల్ట్రీ పరిశ్రమలో మొక్కజొన్నల కొరత సమస్యను పరిష్కరించాలని మంత్రులను సీఎం ఆదేశించారు.
వ్యవసాయ కూలీలకు, రైతులకు ఉపాధి కలిగించే పరిశ్రమ పౌల్ట్రీ అని సీఎం పేర్కొన్నారు.
పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తాం.
పౌల్ట్రీని ప్రాధాన్యత రంగంగా గుర్తించి శాశ్వత పరిష్కారం కోసం కొత్త పాలసీలు రూపొందిస్తాం.
కాలానుగుణంగా, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పాలసీలను మెరుగుపరుస్తాం.
తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదని, గత ప్రభుత్వాల మంచి పాలసీలను కొనసాగిస్తూనే 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.





