దేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేశంలో వైద్య ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ మొత్తం ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లకు చేరుకుంది.
గత పదేళ్లలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం మూడు రెట్లకు పైగా పెరిగింది. దీంతో ప్రజలపై నేరుగా పడుతున్న వైద్య ఖర్చుల భారం కొంత తగ్గింది.
2023-24లో ప్రజలు తమ సొంత డబ్బు నుంచి రూ.4.06 లక్షల కోట్లు వైద్యం కోసం ఖర్చు చేశారు. మొత్తం ఆరోగ్య వ్యయంలో ఇది 42.7 శాతంగా ఉంది. 2013-14లో ఈ వాటా 64.2 శాతంగా ఉండేది.
ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా రూ.97,167 కోట్లు, ప్రభుత్వ బీమా పథకాల ద్వారా రూ.33,385 కోట్లు ఖర్చయ్యాయి. ప్రజల సొంత వైద్య ఖర్చులు ప్రభుత్వ ఆరోగ్య బీమా వ్యయం కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
మొత్తం ఆరోగ్య వ్యయంలో ఆసుపత్రి చికిత్సలకు 38.2 శాతం, నివారణ వైద్యానికి 8.8 శాతం, ప్రాథమిక వైద్యానికి 46 శాతం ఖర్చు చేస్తున్నారు.





