ప్రియుడి కోసం భర్తను చంపించిన భార్య, కాంట్రాక్ట్ కిల్లర్లకు భర్త డబ్బులే చెల్లింపు

32 ఏళ్ల భర్తను ప్రియుడి కోసం చంపించిన భార్య.. కాంట్రాక్ట్ కిల్లర్లకు భర్త డబ్బులే ఇచ్చినట్లు ఆరోపణలు!
బీహార్‌లోని పాట్నా జిల్లా బిహ్‌తా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమ్రి గ్రామంలో దారుణ హత్య జరిగింది.
మహమ్మద్ ఇర్ఫాన్ ఇమామ్ (32), ఫౌజియా ఫిర్దోస్‌లకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ కుటుంబ పోషణ కోసం ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉండేవాడు.
ఈ క్రమంలో పొరుగింటి యువకుడు కరణ్ కుమార్ (22)తో ఫౌజియాకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ సంబంధం గురించి ఇటీవల తెలుసుకున్న ఇర్ఫాన్ భార్యను మందలించాడు.
దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఫౌజియా కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. భర్త బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు తీసి కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల విచారణలో ఫౌజియా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.





