రేణిగుంట ఆంజనేయ పురం ఆలయం తొలగింపు.. కొత్త ఆలయం నిర్మిస్తున్న గ్రామస్థులు

తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. రేణిగుంట-కడప హైవేలోని ఆంజనేయ పురం ఆలయ తొలగింపుపై గ్రామస్థులు, ఆలయ చైర్మన్ తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఆలయ కూల్చివేతపై అసత్య ప్రచారం చేయవద్దని కలెక్టర్ కోరారు.
2002లో ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. 2019లో హైవే ప్రాజెక్టుకు ఆమోదం లభించింది, రూట్ మ్యాప్ వచ్చింది. 2023లో నేషనల్ హైవే అధికారులు భూముల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. 2026 ఆగస్టులో స్థానికులకు పరిహారం చెల్లించారు.
గ్రామస్థుల కోరిక మేరకు రేణిగుంట సమీపంలోని అంజనేయపురంలోనే కొత్తగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గ్రామస్థులు, అర్చకులతో కలిసి బాలాలయం కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతోనే పనులు జరిగాయని, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని కలెక్టర్ స్పష్టం చేశారు.





