తిరుపతి బిజెపి అధ్యక్షుడి ఇంట్లో మహిళ ఆత్మహత్య.. ఆరోపణలపై బిజెపి నేతల ఖండన

తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఇంట్లో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే సామంచి శ్రీనివాస్ ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను బిజెపి నేతలు ఖండించారు. ఆరోపణల్లో కుట్రకోణం దాగి ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు విచారించాలని, ఆయన వద్ద ఆధారాలు ఉంటే పోలీసులకు ఇచ్చి సహకరించాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు.
వివాహేతర సంబంధం, హత్య అంటూ భూమన అసత్య ఆరోపణలు చేయడం నీచమని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న మహిళ ఎవరో తెలియక పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆడియోలో మాట్లాడిన మహిళ ఒక బ్లాక్ మెయిలర్ అని, బిజెపి పేరుతో మోసం చేస్తుంటే ఆమెను పార్టీ నుంచి తొలగించామని సామంచి శ్రీనివాస్ తెలిపారు. ఈ కుట్ర వెనుక ఉన్న కోణాన్ని బయటకు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.





