తిరుమల భక్తులకు ఉచిత బీమా.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC)తో కలిసి టీటీడీ ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పేరుతో ఉచిత జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది.
ఈ పథకం కింద సహజ మరణం సంభవిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది.
తిరుమలలో బస చేసే సమయంలో గరిష్ఠంగా నాలుగు రోజుల వరకు బీమా రక్షణ ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని టీటీడీయే భరిస్తుంది.
మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించి పరిహారం పొందవచ్చు.
సెప్టెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటికే తిరుమలలో సహజంగా మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
శబరిమల, వైష్ణోదేవి ఆలయాల్లోనూ ఇలాంటి బీమా సదుపాయం కోసం ఆయా ఆలయాల అధికారులు ఎల్ఐసీతో సంప్రదింపులు జరుపుతున్నారు.





