రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు మున్సిపల్ అధికారులు!
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజనీర్ ఎ. రాజేశ్ కుమార్, ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ ఎ. శివారెడ్డి శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు.
2025 గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా సదాశివపేటలోని ఊబ చెరువులో చేపట్టిన పూడికతీత పనులకు సంబంధించి రూ.4.50 లక్షల కాంట్రాక్ట్ బిల్లు వ్యవహారంలో రూ.15 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మధ్యాహ్నం 2.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో దాడి చేశారు. రాజేశ్ కుమార్ లంచం తీసుకుని శివారెడ్డికి ఇవ్వగా, అతడి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరినీ అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
A ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.





