జయరాం రమేష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఫైర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జయరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు..
ప్రజల ఉత్సాహాన్ని కోపంగా చిత్రీకరించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా జయరాం రమేష్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల అమితమైన ఉత్సాహం చూసే కార్యక్రమం సజావుగా సాగేందుకు తాను జోక్యం చేసుకున్నానని సీఎం తెలిపారు.
ప్రజల మనోభావాలకు దూరంగా ఉన్నవారే ఉత్సాహాన్ని ఆగ్రహంగా చూస్తారని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో చేసే ప్రచారాలు ప్రజలు వ్యక్తం చేసిన వాస్తవ భావోద్వేగాలను మార్చలేవని చంద్రబాబు స్పష్టం చేశారు.





