భీమవరం మున్సిపాలిటీలో కూటమికి షాక్.. ఒంటరిగా పోటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో కూటమికి షాక్ ఇచ్చారు బీజేపీ నేత శ్రీనివాస వర్మ. తమకు తగిన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవమానాన్ని భరించేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యసభ సభ్యుడు పీకా సత్యనారాయణకు సంబంధించిన వార్డు విషయంలో మూడు రోజులుగా చర్చలు జరిపినా ఫలితం లేదని, ఆ తర్వాత తమకు సమాచారం ఇవ్వకుండానే కూటమి భాగస్వాములు 48 వార్డులకు ఏకపక్షంగా అభ్యర్థుల జాబితాలను హడావిడిగా విడుదల చేశారని ఆరోపించారు. ఏకపక్షంగా జాబితాలు ప్రకటించడం కూటమి ధర్మం కాదని స్పష్టం చేశారు. భీమవరం మున్సిపాలిటీలో కూటమి అవసరం లేదని, ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భీమవరం మున్సిపాలిటీలో కూటమి నుంచి బీజేపీ వైదొలగాలని నిర్ణయం.





