ఉచిత బస్సు ప్రయాణం మంచిదే.. మరి ప్రయాణికుల భద్రత సంగతేంటి?
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆర్టీసీ డిపోకు చెందిన ఓ బస్సు దుస్థితిపై ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాదకర స్థితిలో ఉన్న బస్సు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నట్లు ఓ పౌరుడు వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం మంచి విషయమేనని, అదే సమయంలో ప్రయాణికుల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
బస్సుల నిర్వహణ, ఫిట్‌నెస్‌పై అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు.
ఈ వీడియోలోని బస్సు పరిస్థితిపై ఆర్టీసీ అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.





