తెలుగు ఎడిషన్ · 29 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!
వాతావరణం
📅 తేదీ వారీగా

సామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం

బిజినెస్జాతీయం
సామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నవంబర్ మంత్లీ ఎకనామిక్ రివ్యూను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువుల ధరలు మళ్లీ భగ్గుమనే అవకాశం ఉందని సర్కార్ స్పష్టం చేసింది.

అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి ఎగబాకింది. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 8.94 శాతానికి ఎగబాకి సామాన్యులకు చుక్కలు చూపించింది.

పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మార్కెట్లో వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించడం ప్రకారం ఏడాది చివరి నాటికి 'ఎల్‌నినో' ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పంటల దిగుబడి, ఆహార ధరలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.

అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హార్ముజ్ జలసంధి గుండా జరిగే సరుకు రవాణాపై ఉన్న ముప్పు కూడా ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.

అయితే ఈ కష్టకాలంలోనూ కాస్త ఊరటనిచ్చే అంశాలు లేకపోలేదు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు రావడం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు అదుపులో ఉండే ఛాన్స్ ఉంది.

రూపాయి విలువ బలపడటం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు అదుపులో ఉండే ఛాన్స్ ఉంది.

అలాగే పాజిటివ్ జోన్‌లో ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్ కొనసాగితే ఎల్‌నినో తీవ్రత కొంతమేర తగ్గవచ్చు.

సంబంధిత వార్తలు