హెచ్‌ఎండీఏ ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ షాక్.. మూసాపేట కోకాపేటల్లో బిడ్లు పడలేదు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ రంగం గట్టి షాక్ ఇచ్చింది. మూసాపేట, కోకాపేటలోని విలువైన భూములకు కనీసం ఒక్క బిడ్ కూడా పడలేదు. మూసాపేట 3.15 ఎకరాలకు ఎకరా కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించారు. కోకాపేట నియోపోలిస్ 4.59 ఎకరాలకు రూ.120 కోట్ల ధరతో వేలం పెట్టారు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ ఓపెన్ ప్లాట్ల వేలం కూడా వెలవెలబోయింది. భారీ కనీస ధరలు, రాజకీయ ఆందోళనలే ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గించాయని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు తగ్గించి మళ్లీ వేలం నిర్వహిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.





