తెలంగాణలో కీలక ఐఏఎస్‌ల బదిలీలు.. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల స్పెషల్ ఆఫీసర్‌గా సర్ఫరాజ్ అహ్మద్!

తెలంగాణ ప్రభుత్వం శనివారం పలువురు ఐఏఎస్, ఇతర అధికారుల బదిలీలు, నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో నంబర్ 1740 ద్వారా ఈ ఆదేశాలు ఇచ్చారు.
సర్ఫరాజ్ అహ్మద్ (ఐఏఎస్–2009) హెచ్ఎండీఏ పరిధిలోని మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఆయన గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈవీ నరసింహారెడ్డి (ఐఏఎస్–2017) హెచ్ఎండీఏ నూతన మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకు అప్పగించారు.
బి. అజిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
మయాంక్ మిట్టల్ జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు.
కె. చంద్రకళ హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ స్పెషల్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఆమెకు అప్పగించారు.
ఐఈఎస్ఎస్డీ మనోజ్ హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ ఎండీగా నియమితులయ్యారు.
P. రాము విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా నియమితులయ్యారు.
వి. శ్రీనివాస్ రెడ్డి తన మాతృశాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.





