వరకట్న దురాచారాలపై స్కూళ్లలో ప్రత్యేక బుక్‌లెట్లు

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ వరకట్న దురాచారం, గృహహింసను అరికట్టేందుకు ప్రత్యేక బుక్‌లెట్లను తయారు చేశాయి.
7 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం ఈ బుక్‌లెట్లను రూపొందించారు.
డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మేనేజ్‌మెంట్ స్కూళ్లలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో వీటిని పంపిణీ చేస్తారు.
భవిష్యత్తులో సిలబస్ మార్చినప్పుడు వీటిని పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాల్లో చేరుస్తారు.
స్కూల్ లెవెల్ లో సామాజిక దురాచారాలపై పాఠాలు సరిగ్గా లేవని, వరకట్నం, గృహహింస గురించి స్టూడెంట్స్‌కు క్రమబద్ధంగా బోధించడం లేదని ‘స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ అజ్మల్ బేగ్’ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే 7 నుంచి 10వ తరగతి సోషల్ స్టడీస్‌లో వీటిపై ప్రత్యేక పాఠాలు చేర్చాలని సూచించింది.
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, మహిళా హెల్ప్‌డెస్క్‌లు, హెల్ప్‌లైన్ నంబర్లు, ఆన్‌లైన్ ఫిర్యాదుల వ్యవస్థ గురించి పిల్లలకు తెలియజేయాలని కోర్టు పేర్కొంది.
విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమాజంలోనూ చైతన్యం వచ్చేలా చూడాలని సూచించింది.
స్కూళ్లలో క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులను భాగస్వాములను చేయాలని, టీచర్లకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది.





