వరంగల్ ఆసుపత్రికి కొత్త పేరు.. సర్కార్ ఉత్తర్వులు జారీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 'మహాత్మా గాంధీ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి'గా పేరు మారుస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఈ ఆస్పత్రి స్థాపన, నిర్మాణానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా సమీక్షించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు జీఓ ఎంఎస్ నంబర్ 180 ద్వారా ఈ ఉత్తర్వులను వెలువరించారు.
దీనికి సంబంధించి తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని వైద్య విద్యా సంచాలకులతో (డీఎంఈ) పాటు వరంగల్ కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.





