దొరికిన చోట కొడతాం.. కొండా సురేఖ ఫైర్

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
మొత్తం 112 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ..
ఎంజీఎం ఆస్పత్రి, నూతన కలెక్టరేట్ భవనం వద్ద బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న నిరసనలు హాస్యాస్పదమని మండిపాటు..
ఎంజీఎం ఆస్పత్రి ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం మనందరి అదృష్టమన్న సురేఖ..
త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పేద ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడి..
నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తయినా ఫర్నిచర్, కలర్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టీకరణ..
గాలిలో కత్తులు తిప్పుతున్న ప్రతిపక్ష నేతలకు బాధ్యతలు లేవని ఆగ్రహం..
కొండా వర్గంపై ఎవరైనా అవాకులు చవాకులు పేలితే దొరికిన చోటే చిత్తుచిత్తుగా కొడతామని హెచ్చరిక..
బుద్ధి చెప్పడానికి మా వర్గంలో ఉన్న ఆడవాళ్లే చాలు, మగవాళ్ల వరకు అవసరమే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు.





