అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అగ్రరాజ్యం అమెరికాలో విమానయాన వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.
ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లలో తలెత్తిన భారీ కమ్యూనికేషన్ సమస్యతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అత్యవసరంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తక్షణం నిలిపివేసింది.
ఈ ఆకస్మిక నిర్ణయంతో ఇప్పటికే 11 వేలకు పైగా విమానాలు రద్దవ్వగా, లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
అమెరికాకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితిని బట్టి అనుమతిస్తున్నారు.
2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత, అలాగే 2023 జనవరిలో మాత్రమే ఇలా దేశవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయి.
ఇది ఎవరైనా చేసిన సైబర్ దాడి కాదని, కేవలం టెలికమ్యూనికేషన్ వ్యవస్థల వైఫల్యమేనని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.





