తెలుగు ఎడిషన్ · 14 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
వాతావరణం
📅 తేదీ వారీగా

మహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

ప్రత్యేక కథనంజాతీయం
మహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌, నవంబర్ 13: తెలంగాణ మహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గొప్ప శుభవార్త అందించింది. ఇప్పటికే ‘మహాలక్ష్మి’ పథకం కింద పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంస్థ.. తాజాగా ఏసీ బస్సుల్లోనూ రాయితీ ప్రకటించింది. మంత్లీ బస్‌ పాస్‌ తీసుకునే మహిళలు ఇకపై 15 రోజుల ఛార్జీ చెల్లిస్తే.. నెలరోజుల పాటు ఏసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. దీంతో ఏసీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే మహిళలకు ఆర్థిక భారం తగ్గనుంది. సాధారణ బస్సులతో పాటు ఏసీ సర్వీసుల్లోనూ రాయితీ అందుబాటులోకి రావడంతో మహిళా ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలగనుంది. రోజూ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉండనుంది.

మరోవైపు.. బస్‌ పాస్‌ వినియోగదారులను ప్రోత్సహించేందుకు టీజీఎస్‌ ఆర్టీసీ మరిన్ని ప్రయోజనాలను ప్రకటించింది. మొత్తం 9 రకాల రాయితీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు అందుబాటు ధరల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్‌ పాస్‌ల వినియోగాన్ని పెంచడమే ఈ నిర్ణయాల వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదరణ పొందుతున్న ఆర్టీసీ.. తాజాగా ఏసీ బస్సుల్లో రాయితీలు, ఇతర పాస్‌ సదుపాయాలతో మరింత మందికి చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ప్రకటించిన కొత్త ఆఫర్లు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది..

సంబంధిత వార్తలు