మనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదం
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌కు చెందిన శ్రీనివాసులు శెట్టి, దేవి దంపతులు రైస్‌మిల్ నడుపుతున్నారు.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న తమ పిల్లలతో కలిసి ఈనెల 10న పూరీ జగన్నాథుడి దర్శనానికి వెళ్లారు.
అందరూ కలిసి ఒడిశాలోని బైతరణీ నదిలో స్నానాలు చేస్తుండగా ఆరేళ్ల మనవరాలు యశస్వి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో చిక్కుకుంది.
మనవరాలిని కాపాడేందుకు శ్రీనివాసులు శెట్టి, దేవి వెంటనే ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకారు.
ప్రాణాలకు తెగించి ఆరేళ్ల చిన్నారిని ఒడ్డుకు విసిరేసి కాపాడిన దంపతులు.. నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు.
కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. మూడు గంటల పాటు గాలించి మృతదేహాలను వెలికితీసింది.
దంపతుల మృతదేహాలను గంగవరానికి తీసుకురావడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి మృతదేహాలకు నివాళులు అర్పించగా.. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.





