పోస్టాఫీసుల రూపురేఖలు మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత తపాలా శాఖ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.1,491 కోట్లతో ‘ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ స్కీమ్’ కొనసాగింపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
2026-27 నుంచి 2030-31 వరకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
ఈ పథకం ద్వారా 190 కొత్త పోస్టల్ భవనాల నిర్మాణం, 2,550 సబ్‌పోస్టాఫీసుల ఆధునీకరణ చేపట్టనున్నారు.
అలాగే 20 హెరిటేజ్ కట్టడాల సంరక్షణ, ఉద్యోగుల సంక్షేమం కోసం 150 పోస్టల్ రెసిడెన్షియల్ కాలనీల మరమ్మతులు చేయనున్నారు.





