తెలుగు ఎడిషన్ · 25 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూకుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూ
వాతావరణం
📅 తేదీ వారీగా

తల్లికి బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు!

క్రైమ్నిర్మల్
తల్లికి బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థి సంపత్ కుమార్ ఆత్మహత్య ఘటనపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల కీలక వివరాలు వెల్లడించారు. బెట్టింగ్‌ల కారణంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. తల్లికి బంగారు నగలు కొనివ్వాలనే ఉద్దేశంతో మూడు నెలల క్రితం ఓ జ్యువెలరీ స్కీమ్‌లో సంపత్ పెట్టుబడి పెట్టాడు. తొలుత నెలకు రూ.5 వేల లాభం పొందాడు. ఆ తర్వాత టెలిగ్రామ్ ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని కుటుంబ సభ్యుల డబ్బును కూడా పెట్టుబడిగా పెట్టి నష్టపోయాడు. పెట్టుబడులు పెట్టిన యాప్ అదృశ్యం కావడంతో సంపత్ మనస్తాపానికి గురయ్యాడు. సంపత్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సంపత్ మృతికి స్నేహితులకు సంబంధం లేదని, అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సైబర్ మోసాలకు గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.

సంబంధిత వార్తలు