నిర్మల్ జిల్లా బాసరలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన పెళ్లి సామాగ్రి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిర్మల్ జిల్లా బాసర రవీంద్రపూర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. షేక్ ఇబ్రహీం ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ.10 లక్షల నగదు, 4 తులాల బంగారం కాలిబూడిదయ్యాయి. పెళ్లి కోసం కొన్న ఫర్నిచర్, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.





