25 ఏళ్ల యువకుడి బలవన్మరణం.. భీమనపల్లిలో విషాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లిలో ఉప్పునూతల సంపత్ యాదవ్ (25) మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంపత్, విధులు ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసిన అనంతరం తన గదిలోకి వెళ్లారు. తమ్ముడు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లిదండ్రులు గది తలుపులు తెరిచి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నారు.
కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.





