శబరిమల యాత్రకు కీలక ఆదేశాలు.. ఆన్‌లైన్ క్యూ తప్పనిసరి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శబరిమల మండల-మకరవిళక్కు యాత్ర నేపథ్యంలో కేరళ పోలీసులు భక్తులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి భక్తుడు ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి.
రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
భక్తుల రద్దీని నియంత్రించడానికి, తొక్కిసలాటలను నివారించడానికి ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.
కేరళ పోలీసులు ఈ సూచనలను ఏపీ డీజీపీ కార్యాలయానికి పంపించారు.





