హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా?.. 8 రియల్ ఎస్టేట్ సంస్థలపై TG RERA చర్యలు!

హైదరాబాద్‌లో ఇల్లు కొనేవారికి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, అనుమతుల లేమి, కొనుగోలుదారులకు డబ్బులు తిరిగి చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనలపై ఎనిమిది సంస్థలపై చర్యలు తీసుకుంది.
Sanali The Edge, మంచిరేవుల: రిజిస్ట్రేషన్ నిబంధనల ఉల్లంఘనపై రూ.25 లక్షల జరిమానా. రిజిస్ట్రేషన్ పొందే వరకు విక్రయాలు, ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశం.
Sri Aditya Squares: రూ.17 లక్షలు వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశం.
Tripura Constructions: రూ.41.85 లక్షలు వడ్డీతో రీఫండ్ చేయాలని ఆదేశం.
Vasavi Realtors LLP: రూ.49.50 లక్షలపై ఫ్లాట్ అప్పగించే వరకు 10.85% వార్షిక వడ్డీ చెల్లించాలని ఆదేశం.
SVM Aditya Homes: రూ.27.16 లక్షలు వడ్డీతో రీఫండ్ చేయాలని ఆదేశం.
Arine Emerald, మియాపూర్: కొనుగోలుదారుడికి ఫ్లాట్ నంబర్ 502 వెంటనే అప్పగించాలని ఆదేశం.
BVR Infra Developers: రూ.7 లక్షలు వడ్డీతో రీఫండ్ చేయాలని ఆదేశం.
Bhuvanteza Infra Projects: రూ.26 లక్షలు వడ్డీతో రీఫండ్ చేయాలని ఆదేశం.
ఆదేశాలు పాటించకపోతే RERA చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం అదనపు జరిమానాలు విధించవచ్చని అథారిటీ హెచ్చరించింది.





