హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హుడా హైట్స్, నియోపోలిస్, మూసాపేట్ భూముల ఈ-వేలం

హైదరాబాద్ రాయదుర్గ్ టి-హబ్‌లో నవంబర్ 17, 2026న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో భూముల ఈ-వేలంపై ప్రీ-బిడ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి ఆసక్తిగల బిడ్డర్లు హాజరయ్యారు.
ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ అధికారులు, ఎంఎస్‌టీసీ (MSTC) అధికారులు, కేపీఎంజీ (KPMG) ట్రాన్సాక్షన్ అడ్వైజర్లు పాల్గొన్నారు.
భూముల వ్యూహాత్మక ప్రదేశాలు, రవాణా సదుపాయాలు, మౌలిక వసతులపై కేపీఎంజీ వివరించింది. రిజిస్ట్రేషన్, బిడ్డింగ్ విధానాలపై ఎంఎస్‌టీసీ అధికారులు అవగాహన కల్పించారు.
బిడ్డర్ల సందేహాలను, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) చెల్లింపు మరియు ఇతర విధివిధానాలను హెచ్‌ఎండీఏ అధికారులు నివృత్తి చేశారు.
హుడా హైట్స్: నవంబర్ 25న ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు 8 ప్లాట్లకు వేలం.
నియోపోలిస్: నవంబర్ 27న ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు 4.59 ఎకరాలకు వేలం.
మూసాపేట్: నవంబర్ 27న మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 6:00 వరకు 3.15 ఎకరాలకు వేలం.
ఈ-వేలాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు పాల్గొనే విధివిధానాల కోసం ఆసక్తిగల బిడ్డర్లు హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు లేదా 7416835522 నంబర్‌ను సంప్రదించవచ్చు.





