తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఐదు లక్షల ఇందిరమ్మ బీమా కల్పించాలని సీఎం ఆదేశంతెలంగాణలో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. GHMC పరిధిలో నమోదు శిబిరాలకు ఏర్పాట్లు!ఇంటికి డ్రాప్ చేస్తామంటూ ఆటోలో ఎక్కించుకుని మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్టు!వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశం.. పంచాయతీ ఎన్నికలపై వ్యూహంహైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా?.. 8 రియల్ ఎస్టేట్ సంస్థలపై TG RERA చర్యలు!KTR పై పొంగులేటి ఫైర్కొండగట్టు అంజన్న నిజరూపం చూస్తారా?సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఐదు లక్షల ఇందిరమ్మ బీమా కల్పించాలని సీఎం ఆదేశంతెలంగాణలో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. GHMC పరిధిలో నమోదు శిబిరాలకు ఏర్పాట్లు!ఇంటికి డ్రాప్ చేస్తామంటూ ఆటోలో ఎక్కించుకుని మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్టు!వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశం.. పంచాయతీ ఎన్నికలపై వ్యూహంహైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా?.. 8 రియల్ ఎస్టేట్ సంస్థలపై TG RERA చర్యలు!KTR పై పొంగులేటి ఫైర్కొండగట్టు అంజన్న నిజరూపం చూస్తారా?
వాతావరణం
📅 తేదీ వారీగా

రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఐదు లక్షల ఇందిరమ్మ బీమా కల్పించాలని సీఎం ఆదేశం

ప్రత్యేక కథనంజాతీయం
రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఐదు లక్షల ఇందిరమ్మ బీమా కల్పించాలని సీఎం ఆదేశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు.

✅ ఈ నెల 19న సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణను ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

✅ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం అమలు కావాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. బీమా పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ బీమా వల్ల ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది మంది పేదలు లబ్ధి పొందుతారని తెలిపారు.

✅ ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల్లో జీవిత బీమా కింద రెండు లక్షలు, ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయల వరకు అందిస్తున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు.

✅ వివిధ శాఖల ద్వారా ఇప్పటికే అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి, వారికి లభిస్తున్న ప్రమాద బీమా ప్రయోజనాలను కొనసాగించేలా చూడాలన్నారు. కొన్ని శాఖల్లో ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకువచ్చి రూ.5 లక్షలకు పెంచాలని సూచించారు.

✅ రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీమా భద్రత అందుకుంటున్న వారిలో ఏ ఒక్కరినీ కూడా మినహాయించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.

✅ సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని సమావేశంలో స్పష్టం చేశారు. పంపిణీకి వీలుగా చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలని సూచించారు.

✅ ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇందిరమ్మ చీరల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

✅ ఇందిరమ్మ బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. బీమా దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు