తెలంగాణలో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. GHMC పరిధిలో నమోదు శిబిరాలకు ఏర్పాట్లు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' అమలుపై GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న, కుటుంబానికి ఆదాయం సమకూర్చే వ్యక్తులు బీమాకు అర్హులుగా పేర్కొన్నారు.
GHMC పరిధిలో అర్హులైన కుటుంబాల నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కమిషనర్ ఆదేశించారు.
నమోదు సమయంలో కుటుంబ వివరాలు, బీమా పొందే వ్యక్తి, నామినీ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.





