డేటింగ్ యాప్ పేరుతో దోపిడీలు.. డాక్టర్ అరెస్ట్

హైదరాబాద్‌లో గ్రైండర్ డేటింగ్ యాప్ వేదికగా దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో కర్నూలుకు చెందిన దినేష్ రెడ్డి అనే డాక్టర్ కీలక నిందితుడిగా ఉన్నాడు.
నిందితులు ఆరిఫ్, సంతోష్, దినేష్, సాగర్, కార్తిక్ అరెస్ట్ అయ్యారు.
ఏడాది కాలంలోనే ఈ ముఠా 20 దోపిడీలకు పాల్పడింది.
హైదరాబాద్, మల్కాజిగిరి, వైజాగ్ పరిధిలో కేసులు నమోదయ్యాయి.
ఆరిఫ్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాడు.
గ్రైండర్ యాప్‌లో పక్కా ప్లాన్ ప్రకారం జాయిన్ అయ్యి, గే ఫ్రెండ్‌షిప్ పేరుతో పరిచయం చేసుకుని వీడియో కాల్స్ చేసేవారు. వీడియో కాల్‌లో అవతలి వ్యక్తి మెడలో చైన్ ఉందో లేదో గమనించి, ప్లాన్ ప్రకారం 4 బీర్లు తీసుకుని రూమ్ కు వెళ్లేవారు. వెళ్ళక ముందే వారి నుండి డబ్బులు పంపించుకునేవారు.
జీడిమెట్లలో జరిగిన మరో ఘటనలో వీరు ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది.
నిందితులందరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తారు.





