గిరిబాబు కన్నుమూత.. సినీ లోకంలో విషాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రముఖ నటుడు, దర్శకుడు యర్ర శేషగిరి రావు (గిరిబాబు) నవంబర్ 14, 2026 శనివారం నాడు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు.
1973లో 'జగమే మాయ'తో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన, 50 ఏళ్ల కెరీర్‌లో 600కు పైగా చిత్రాల్లో నటించారు.
నటుడిగానే కాకుండా 'రణరంగం', 'సింహ గర్జన' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, నాలుగు సినిమాలను నిర్మించారు.
ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ప్రముఖ నటుడు, కమెడియన్ రఘుబాబు ఒకరు.
గిరిబాబు మృతి పట్ల చిరంజీవి, మోహన్ బాబు, అనిల్ రావిపూడి సంతాపం తెలుపుతూ ఆయన నటన, క్రమశిక్షణను కొనియాడారు.
అమెరికాలోని అల్బానీ తెలుగు అసోసియేషన్ సభ్యులు తమ వేడుకల్లో రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.
సినీ లోకానికి తీరని లోటు





