హైదరాబాద్ జల్‌పల్లి కార్గో రోడ్డుపై భారీ కొండచిలువ .. వాహనదారుల పరుగులు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారి.. మరోవైపు శ్రీశైలం వెళ్లే ప్రధాన మార్గం.. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ప్రత్యక్షమైన భారీ అజగర్...
సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు, అటవీ శాఖ అధికారుల సహకారంతో స్నేక్ రెస్క్యూయర్ మల్లేష్ నాయక్ అక్కడికి చేరుకున్నారు. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ఎలాంటి హాని కలగకుండా కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
రెస్క్యూ చేసిన ఈ కొండచిలువ విషపూరితం కాని రాక్ పైథాన్‌గా గుర్తించారు. దీనిని శంషాబాద్ అటవీ ప్రాంతంలోని సహజ ఆవాసంలో విడిచిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.





