మోదీ సర్కార్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. సీఈసీ రాజీనామాకు డిమాండ్
ఢిల్లీలోని బారాఖంబా పోలీస్ స్టేషన్ ఎదుట రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మీడియా తో మాట్లాడిన తెలంగాణ సీఎం.
తమను టార్గెట్ చేసే ప్రయత్నాలు చేసినా తాము తలొగ్గేది లేదని స్పష్టం చేశారు..
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..
లేకపోతే ప్రధాని మోదీనే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు..
ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ, మోదీ ఈడీ, ఐటీ, సీబీఐలను వాడుకుంటున్నారని మండిపడ్డారు..
రైతు ఉద్యమం సమయంలో వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పినట్లే, ప్రజా ఉద్యమానికి మోదీ తలొగ్గక తప్పదని హెచ్చరించారు..
ఇది కేవలం కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి ఆందోళన కాదని, ప్రజల ఉద్యమమని పేర్కొన్నారు..
రాహుల్ గాంధీ నాయకత్వంలో వీధుల నుంచి పార్లమెంటు వరకు రాజ్యాంగ పరిరక్షణ పోరాటం కొనసాగుతుందని తెలిపారు..
తదుపరి నిరసనలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేశారు..





