హనుమకొండలో కాంగ్రెస్, BRS ఘర్షణలు.. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హనుమకొండలో కాంగ్రెస్, BRS మధ్య పరస్పర దాడులు, సవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది.
నిన్నటి ఘటన నేపథ్యంలో వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
పక్కనే ఉన్న BRS పార్టీ కార్యాలయం దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు.
హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు.
మళ్లీ గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు.





