యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం

మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం అందించింది.
బుధవారం డిజిపి సి. వి. ఆనంద్‌కు అరోబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అరోబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ కె. నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్ సీఎస్‌ఆర్ హెడ్ ఎస్. సదానంద రెడ్డి, అరోబిందో ఫార్మా లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ.ఎస్.ఆర్. రావు చెక్కును అందజేశారు.
ఈ విరాళం అందేలా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక చొరవ చూపారు. ఫౌండేషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, విరాళం అందేలా కృషి చేశారు.
పాఠశాల్లో మెరుగైన విద్యా సదుపాయాలు, మౌలిక వసతుల బలోపేతానికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలను కల్పించేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడనుంది.
ఈ కార్యక్రమంలో డిజిపి సి. వి. ఆనంద్, మహిళా భద్రతా విభాగం డిజి సౌమ్య మిశ్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, ఏడీజీ (శాంతిభద్రతలు) అకున్ సబర్వాల్ పాల్గొన్నారు.





