అమర పోలీసులకు రక్తంతో నివాళి.. హైదరాబాద్‌లో 37 చోట్ల మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
“రక్తమిచ్చి ప్రాణం నిలుపుదాం.. అమరుల త్యాగానికి సెల్యూట్ చేద్దాం” అనే పిలుపుతో హైదరాబాద్ పోలీసులు భారీ రక్తదాన కార్యక్రమానికి సిద్ధమయ్యారు.
పోలీస్ అమర జవాన్ల త్యాగాలకు నివాళిగా అక్టోబర్ 29న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 37 ప్రాంతాల్లో, 28 ప్రముఖ బ్లడ్ బ్యాంకుల సహకారంతో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.
ప్రమాద బాధితులు, తలసేమియా బాధితులు సహా అత్యవసరంగా రక్తం అవసరమైన వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, కాలనీ సంఘాలు సహా అర్హులైన నగరవాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని హైదరాబాద్ పోలీసులు పిలుపునిచ్చారు.





