హైదరాబాద్‌లో పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ రద్దు, పలు బేకరీలపై టీజీ సేఫ్ చర్యలు
పేరు పెద్దదని నమ్మి కొనేస్తున్నారా?. మీరు తినే స్వీట్స్ ఎంత సేఫ్?.. పుల్లారెడ్డి లైసెన్స్ సస్పెండ్, కరాచీ బేకరీకి నోటీసు!
హైదరాబాద్‌లో ప్రముఖ స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలపై TG SAFE భారీ తనిఖీలు చేపట్టింది. మొత్తం 16 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 3,546.5 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం/తొలగించినట్లు, వాటి విలువ సుమారు ₹16.86 లక్షలు అని అధికారులు తెలిపారు.
G Pulla Reddy Sweets – Sanath Nagarలో ఎలుకల మలం, పాడైన కూరగాయలు, గడువు ముగిసిన/తప్పుడు లేబులింగ్ ఉన్న పదార్థాలు సహా పలు పరిశుభ్రత లోపాలు గుర్తించినట్లు TG SAFE తెలిపింది. దీంతో అక్కడి FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. ఒక్క ఈ కేంద్రం నుంచే 3,133 కిలోల ఆహార పదార్థాలు, విలువ ₹15.03 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Karachi Bakery International, Timmapurకు షోకాజ్ నోటీసు జారీ చేయగా, మరో నాలుగు సంస్థలతో కలిపి మొత్తం 5 లైసెన్సులు సస్పెండ్ చేశారు. సరైన FSSAI లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో నడుస్తున్న మరో 5 సంస్థలను మూసివేశారు.





