IAS–IPS దంపతుల కుటుంబం పేర్లపై 40 విల్లాలు–కాటేజీలు.. ఒకే కంపెనీ నుంచి కొనుగోలు!
రాజస్థాన్‌కు చెందిన సీనియర్ IAS అధికారి శిఖర్ అగర్వాల్, ఆయన భార్య IPS అధికారి ప్రశాఖ మాథూర్ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల కొనుగోళ్లపై కొత్త చర్చ మొదలైంది.
దైనిక్ భాస్కర్ దర్యాప్తు కథనం ప్రకారం, ఈ దంపతులు, వారి ఇద్దరు కుమారులు, అత్తమామల పేర్లపై రెండున్నరేళ్ల వ్యవధిలో మొత్తం 40 విల్లాలు, కాటేజీలు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపుతున్నాయి. ఈ ఆస్తులన్నీ Goyal Fashions Pvt Ltdకు చెందిన Ananta Resorts ప్రాజెక్టుల్లోనే ఉన్నాయని నివేదిక పేర్కొంది.
ఉదయ్‌పూర్ సమీపంలోని బుజ్డాలో 20 కాటేజీలు సెప్టెంబర్ 2023లో, అల్వార్ జిల్లా అజబ్‌గఢ్‌లో 20 విల్లాలు మార్చి 2026లో రిజిస్టర్ అయినట్లు కథనం తెలిపింది. మొత్తం కొనుగోలు విలువ సుమారు ₹6.16 కోట్లుగా పేర్కొంది.
అలాగే కొనుగోలు చేసిన ఆస్తులను తిరిగి అదే కంపెనీకి లీజ్ ఇచ్చి ఏటా సుమారు ₹1.80 కోట్ల అద్దె ఆదాయం వచ్చేలా ఒప్పందాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
శిఖర్ అగర్వాల్ ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వంలో Additional Chief Secretary (Industries)గా, RIICO Chairmanగా కొనసాగుతున్నారు.





