మహిళా నేతలతో కేటీఆర్ సమావేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై బీఆర్ఎస్ మహిళా నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ భేటీ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పండుగను ఘనంగా ఎలా నిర్వహించాలనే దానిపై ఆయన చర్చించనున్నారు. మహిళా క్యాడర్‌ను యాక్టివ్ చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
ఏపీలో రేపు 517 మద్యం దుకాణాల కేటాయింపు
ఏపీలో లాటరీ విధానం ద్వారా రేపు 517 మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇప్పటికే 2 వేల 929 దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన షాపులకు అధికారులు లాటరీ తీసి డ్రా ద్వారా లైసెన్సులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.





