తెలుగు ఎడిషన్ · 22 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!
వాతావరణం
📅 తేదీ వారీగా

అమెరికాలో కలకలం.. ఫ్రాడ్ కేసులో నేరం అంగీకరించిన నాటా మాజీ అధ్యక్షుడు

ప్రత్యేక కథనంజాతీయం
అమెరికాలో కలకలం.. ఫ్రాడ్ కేసులో నేరం అంగీకరించిన నాటా మాజీ అధ్యక్షుడు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శాన్ జోస్:

అమెరికాలోని నార్తర్న్ కాలిఫోర్నియాలో భారీ ఫ్రాడ్ కేసు కలకలం రేపింది. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి గోసల నేరం అంగీకరించారు. చారిటబుల్ మ్యాచింగ్ ప్రోగ్రామ్‌లను మోసగించడం, ట్యాక్స్ రిటర్న్‌లను తప్పుగా చూపించడం లాంటి వ్యవహారాల్లో ఆయన ఫెడరల్ కోర్టులో తప్పు ఒప్పుకున్నారు. వైర్ ఫ్రాడ్, అమెరికా ప్రభుత్వాన్ని మోసగించే కుట్ర చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

లాభాపేక్ష లేని సంస్థను అడ్డం పెట్టుకుని ఆయన ఈ మోసానికి పాల్పడ్డారు. నాటా సంస్థ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యజమానుల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్ల ఫ్రాడ్ విరాళాలను ఆయన సేకరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పెన్సిల్వేనియాలోని నార్త్ వేల్స్‌కు చెందిన 65 ఏళ్ల రాఘవరెడ్డి గోసల పై 2026 మే 5న కేసు నమోదు అయింది. ఫెడరల్ కోర్టులో విచారణ జరగ్గా తనపై మోపిన అభియోగాలన్నింటినీ ప్లీ అగ్రిమెంట్ కింద ఆయన అంగీకరించారు.

ఈ కేసును అసిస్టెంట్ యూఎస్ అటార్నీ మైఖేల్ జి. పిట్‌మాన్, సాహిబ్ కౌర్ సహాయంతో వాదిస్తున్నారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, ఎఫ్‌బీఐ దర్యాప్తు సంస్థల విచారణ తర్వాత రాఘవరెడ్డి గోసల వ్యవహారం బయటపడింది. నేరం అంగీకరించడంతో ఈ కేసు తదుపరి విచారణలో కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు