ప్రజా భవన్

హరీష్ రావు ఆరోపణలను ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హరీష్ రావు ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచాలని చూస్తున్నారు
ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా హరీష్ రావు వ్యవహరిస్తున్నారు
హరీష్ రావు రాజకీయ లబ్ధి కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
హరీష్ రావు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి
యాదాద్రి పవర్ ప్లాంట్ పాపం ఎవరిది?
పవర్ ప్లాంట్ పెట్టేటప్పుడు డీపీఆర్ ఇవ్వాలి
బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ముఖ్యం
సింగరేణి నుంచి సరఫరా చేయిస్తామని సంతకం పెట్టారు
సింగరేణితో సంతకం పెట్టించినప్పుడు G-9 బొగ్గు ఉందా? లేదా?
తప్పుడు సమాచారంతో తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు
విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేయబోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
నెహ్రూ ఆలోచనలను కాంగ్రెస్ అమలు చేస్తోంది
రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా 19,892 మెగావాట్ల డిమాండ్ ఉంది
తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధిక విద్యుత్ వినియోగం
విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది
ఏపీలో 15 వేల మెగావాట్ల డిమాండ్ ఉంది
ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలను అభినందిస్తున్నాం





