ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు శుభవార్త.. పుష్పక్ బస్సు ఛార్జీలు రూ.150 వరకు తగ్గింపు!

⠀
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఊరట! పుష్పక్ ఏసీ బస్సుల ఛార్జీలను టీజీఎస్‌ఆర్టీసీ తగ్గించింది. కొత్త ఛార్జీలు నేటి నుంచి—అక్టోబర్ 7, 2026—అమల్లోకి వచ్చాయి.
🚌 ఎయిర్‌పోర్ట్‌కు రూట్‌వారీ ఛార్జీలు
పాత ఛార్జీ ➡️ కొత్త ఛార్జీ
🔸 జేబీఎస్: రూ.350 ➡️ రూ.200
🔸 జేఎన్‌టీయూ: రూ.350 ➡️ రూ.200
🔸 మియాపూర్ క్రాస్‌రోడ్: రూ.350 ➡️ రూ.250
🔸 గచ్చిబౌలి: రూ.300 ➡️ రూ.150
🔸 లింగంపల్లి: రూ.300 ➡️ రూ.200
🔸 కొండాపూర్: రూ.300 ➡️ రూ.200
గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఛార్జీ సగానికి తగ్గింది! జేబీఎస్, జేఎన్‌టీయూ నుంచి వెళ్లేవారికి ఒక్కో ప్రయాణంపై రూ.150 ఆదా.
జేబీఎస్–మెహదీపట్నం, జేబీఎస్–ఆరాంఘర్ మధ్య ఎంపిక చేసిన పుష్పక్ సర్వీసుల్లో ఛార్జీ రూ.100గా నిర్ణయించారు.
ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ కొత్త ఛార్జీల వివరాలు షేర్ చేయండి!





