తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
పునఃప్రారంభం కోసం చెరుకు రైతుల పోరుబాటవైరల్ వీడియోలపై సంజు దేవి ప్రచారం..అడవి మామిడిపల్లిలో కోతుల స్వైరవిహారంరైల్వే టికెట్ చెకర్లకు బాడీ కెమెరా జాకెట్లురేపు తిరుపతిలో విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌మత్స్యకార యువకుడి మృతి కేసులో ఎంక్వయిరీపాడి పరిశ్రమకు కేరాఫ్‌గా మాణిక్యపురంఖైరతాబాద్ కారు నేతలకు సర్వేల ఫీవర్పునఃప్రారంభం కోసం చెరుకు రైతుల పోరుబాటవైరల్ వీడియోలపై సంజు దేవి ప్రచారం..అడవి మామిడిపల్లిలో కోతుల స్వైరవిహారంరైల్వే టికెట్ చెకర్లకు బాడీ కెమెరా జాకెట్లురేపు తిరుపతిలో విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌మత్స్యకార యువకుడి మృతి కేసులో ఎంక్వయిరీపాడి పరిశ్రమకు కేరాఫ్‌గా మాణిక్యపురంఖైరతాబాద్ కారు నేతలకు సర్వేల ఫీవర్
వాతావరణం
📅 తేదీ వారీగా

రికార్డుల్లో 388 ఎకరాలు.. సర్వేలో 343 ఎకరాలే! ఎర్రవల్లిలో మిగతా 45 ఎకరాలు ఎక్కడ?

ప్రత్యేక కథనంజాతీయం
రికార్డుల్లో 388 ఎకరాలు.. సర్వేలో 343 ఎకరాలే! ఎర్రవల్లిలో మిగతా 45 ఎకరాలు ఎక్కడ?
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

లెక్క తేల్చాలని సీఎం రేవంత్ ఆదేశం.. అర్హులైన రైతులకు భూ పంపిణీ, అమరవీరుల కుటుంబాలకు కాలనీ నిర్మాణంపై కీలక నిర్ణయాలు!

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. రెండు గ్రామాల పరిధిలో నిర్వహించిన సర్వే వివరాలను అధికారులు సీఎంకు నివేదించారు.

45 ఎకరాల లెక్క తేడా

ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉండగా.. క్షేత్రస్థాయి సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 45 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలని సీఎం ఆదేశించారు.

సర్వే నోటిఫికేషన్.. రికార్డుల కోసం నోటీసులు

లెక్కలోకి రాని భూమిని గుర్తించేందుకు ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సరిహద్దుల్లోని భూములకు సంబంధించి సంబంధిత కుటుంబ సభ్యులు రెవెన్యూ రికార్డులు సమర్పించేలా నోటీసులు జారీ చేయనున్నారు.

స్థానిక రైతులకు భూములు

సర్వే నంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణ అమరవీరుల కాలనీ

అదే సర్వే నంబర్‌లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ నిర్మించాలని సీఎం ఆదేశించారు.

అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అన్ని సౌకర్యాలతో కాలనీ ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించి, జూన్ 2లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు