కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఓవైపు స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం... మరోవైపు పవిత్ర కార్తీకమాసం కావడంతో వెంకన్న ఆలయానికి మరింత పెరిగిన భక్తుల రద్దీ.
తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు.
ఏడు వారాలు... ఏడు ప్రదక్షణల నోముల భక్తులతో కిటకిటలాడుతున్న స్వామివారి ఆలయ మాడవీధులు.
గోవింద నామస్మరణతో మారుమోగుతున్న చందన స్వరూపుడైన వాడపల్లి వెంకన్న దివ్య క్షేత్రం.
స్వామివారి దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తజనం... కొనసాగుతున్న దర్శనాలు...





