తిరుమల స్వామి వారికి 121 కిలోల బంగారం సమర్పించిన భక్తుడు వర్ధమాన్ జైన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెన్నై పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ 121 కిలోల బంగారాన్ని విరాళంగా సమర్పించారు.
వర ఫ్యూచర్ ఎల్ఎల్‌పీ సంస్థ చైర్మన్ అయిన ఆయన, టీటీడీకి ఈమధ్య కాలంలో భారీ విరాళం అందించిన దాతగా నిలిచారు.
మే 16, 2025న తిరుమల భక్తుల ఉచిత రవాణా కోసం ఆయన ఒక అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చారు.
జనవరి 2025లో ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.6 కోట్లు విరాళంగా అందించారు.
నవంబర్ 2024లో ఎస్వీ అన్నప్రసాదం, ప్రాణదాన ట్రస్టులకు రూ.2.02 కోట్లు అందజేశారు.
తాజా 121 కిలోల బంగారం విరాళానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.





