దైవదర్శనం చేసుకుని వస్తుండగా ఘోర ప్రమాదం.. తల్లిదండ్రులు మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో హైదరాబాద్ బండ్లగూడకు చెందిన కోటా కిషోర్ రెడ్డి, ఆయన భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు.
కారు నడుపుతున్న వారి కుమారుడు ప్రణీత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు.
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
దంపతుల మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.





