ఖమ్మం యువకుడికి బ్రిటన్ యువతితో వివాహం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖమ్మంకు చెందిన భరత్, బ్రిటన్ యువతి ఎలిజబెత్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లిన భరత్, ఎంఎస్ పూర్తి చేసి అక్కడి ప్రభుత్వ పెన్షన్ శాఖలో ఉద్యోగం పొందారు.
అదే శాఖలో పనిచేస్తున్న ఎలిజబెత్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది.
ఇరు కుటుంబాల అంగీకారంతో ఖమ్మంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది.





