ఢిల్లీ ప్రీత్ విహార్‌లో కేఫ్‌లో సహోద్యోగుల గ్యాంగ్‌రేప్.. ముగ్గురు అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీ ప్రీత్ విహార్‌లోని కర్కర్డూమా క్రాస్ రివర్ మాల్లో ఉన్న కేఫ్ 8లో బాధితురాలు పనిచేస్తున్నారు. అక్కడే నిందితులు కూడా పనిచేస్తూ ఉండగా, సోమవారం రాత్రి ఎనిమిది మంది స్నేహితులు మూసివేసిన కేఫ్ తాళం తీసి పార్టీ చేసుకున్నారు.
అర్ధరాత్రి దాటాక మద్యం మత్తులో ఇద్దరు యువకులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా, మిగతా స్నేహితులు వారికి సహకరించారు. ఈ ఘటన తెల్లవారుజామున 3:30 గంటలకు వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ పోలీసులు ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.





