మీరు కొనేది ఫైన్ రైసా.. పాలిష్ చేసిన రేషన్ బియ్యమా? హైదరాబాద్‌లో స్కామ్ బట్టబయలు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మీ ఇంటి బియ్యం ప్యాకెట్ ఒక్కసారి చెక్ చేయండి!
హైదరాబాద్‌లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, ప్రముఖ కంపెనీల బ్రాండింగ్‌తో ఫైన్ రైస్‌గా అమ్ముతున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
కిలోకు ₹80 నుంచి ₹100 వరకు ధరకు ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్మన్‌ఘాట్ ప్రాంతంలోని పలు రైస్ డిపోలు, దుకాణాలపై సివిల్ సప్లైస్–విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
పలు దుకాణాల నుంచి బియ్యం నమూనాలను సేకరించగా, అధికారులను చూసి కొంతమంది షాపులు మూసివేసి వెళ్లిపోయినట్లు సమాచారం.
వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి: బ్రాండ్ పేరు చూసి మాత్రమే కొనకుండా, ప్యాకింగ్ వివరాలు, FSSAI సమాచారం, బిల్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.





