‘‘సారీ KTR గారూ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొండా సురేఖ ప్రకటన.. గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు.
అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
“ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. కేటీఆర్‌ను లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలని నాకు ఎలాంటి దురుద్దేశం లేదు” అని పేర్కొన్నారు.
తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు నొచ్చుకుని ఉంటే అందుకు చింతిస్తున్నానని, గత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ వెల్లడించారు.





